ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు. శనివారం ఆయన జీవీఎంసీ అధికారులతో కలిసి గోపాలపట్నం లక్ష్మీ నగర్ లో పర్యటించి ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజ్, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.