గోపాలపట్నం: విశాఖ డెయిరీ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలి

50చూసినవారు
గోపాలపట్నం: విశాఖ డెయిరీ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలి
విశాఖ డెయిరీ యాజమాన్యం అవినీతి అక్రమాలపై పార్లమెంటులో చర్చించాలని 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ శనివారం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విశాఖ విమానాశ్రయంలో ఎంపీ కి ఆయన వినతిపత్రం అందజేశారు. పాడి రైతుల పాల సేకరణ ధర డెయిరీ తగ్గించడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ ద్వారా విచారణ నిర్వహించాలని కోరారు.

సంబంధిత పోస్ట్