విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో హార్బర్ ఏసీపీగా పనిచేస్తున్న మోసేజ్పాల్ను సస్పెండ్ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. తన సబ్ డివిజన్ పరిధిలో స్టేషన్లకు వచ్చే ముఖ్యమైన కేసులను కొంతమంది కానిస్టేబుళ్ల ద్వారా తన వద్దకు తెప్పించుకుంటారని, సివిల్ కేసుల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి.