గోపాలపట్నం 91వ వార్డు లక్ష్మీనగర్ నందు సోమవారం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ కార్మికులకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ పారిశుధ్య కార్మికులు, నీటి సరఫరా కార్మికులు వివిధ శాఖల కార్మికులకు వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు.