ఉపాధ్యాయులు మొక్కుబడిగా పనిచేయకుండా విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో పని చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్. హరేంద్ర ప్రసాద్ సూచించారు. శనివారం ఆయన అడివివరం ఎస్సీ గురుకుల పాఠశాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. తగిన కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు. విద్యార్థుల తప్పొప్పులను సరిదిద్ది వారిని మంచి మార్గంలో పయనింపజేయాలని సూచించారు.