పశ్చిమ విశాఖ - West Vizag

విశాఖ మెట్రో రైలు పై కీలక అప్డేట్

విశాఖ మెట్రో రైలు పై కీలక అప్డేట్

విశాఖ మెట్రో రైలు పనులపై ఏపీ అసెంబ్లీలో మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడగా, ముందుగా విశాఖ మెట్రో ప్రాజెక్టు పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ, "విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పై సమగ్ర రవాణా ప్రణాళికను కేంద్రానికి పంపించాం. కేంద్రం నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తాం" అని తెలిపారు. 100% కేంద్ర నిధులతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం కోరిందని చెప్పారు. ఫస్ట్ ఫేజ్లో 46.2 కి.మీ. పొడవునా మూడు కారిడార్లు నిర్మిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు, వాటిలో 14 జంక్షన్లు, 8 మీటర్ల ఫ్లై ఓవర్ నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.

వీడియోలు


హైదరాబాద్