అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆంధ్ర బాపిస్ట్ చర్చీలో బుధవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరావు మాట్లాడుతూ ఏసుక్రీస్తు చూపిన బాటలో అందరూ నడవాలని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రేమ శాంతి దయాగుణాన్ని కలిగి ఉండాలన్నారు.