జంగులూరు జంక్షన్ వద్ద కొండపాలెం గ్రామానికి చెందిన చోడపల్లి గంగరాజు(19)ను దొంగతనం కేసులో సోమవారం అరెస్ట్ చేసినట్లు అచ్యుతాపురం సీఐ గణేశ్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై దృష్టి సారించామన్నారు. ఈ మేరకు గంగరాజును అరెస్టు చేసి అతని వద్ద ఒక బంగారు గొలుసు, మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వాటిని సీజ్ చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.