వారఫలాలు (సెప్టెంబర్ 4 నుంచి 10 వరకు)

55434చూసినవారు
వారఫలాలు (సెప్టెంబర్ 4 నుంచి 10 వరకు)
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : రాశి అధిపతి అయిన కుజ గ్రహం ధన స్థానమైన వృషభ రాశిలో సంచరించడం వలన రెండు ప్రధాన గ్రహాలు శని, గురువులు తమ స్వస్థానాల్లో వక్రించడం వంటి కారణాల వల్ల ఈ వారం ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభంతో పాటు అదృష్ట యోగం కూడా పట్టబోతోంది. జీవితం ఒక సానుకూల మలుపు తిరిగినాఆశ్చర్యపోనక్కర లేదు. కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారం దక్కే అవకాశం ఉంది.ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. శుభవార్తలు వింటారు. ఐ.టి, సాంకేతిక విభాగ విద్యార్ధుల పురోగతి సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : వృషభంలో కుజ గ్రహ సంచారంతో, శని, గురు గ్రహాల వక్ర గమమనం ఈ రాశి వారికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది.ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన సమస్యలకు ఒక చక్కని పరిష్కారం దొరుకుతుంది. అన్ని విధాలా అదృష్టం కలిసి వస్తుంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. చాలావరకు అప్పులు తీరుస్తారు. ఆరోగ్యానికి లోటు ఉండదు. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. వివాహ సంబంధం కుదురుతుంది. విద్యార్ధులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండాలి. సన్నిహితులొకరు మోసగించే ప్రమాదం ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : మూడు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పులు చోటు చేసుకున్నందువల్ల, ఉద్యోగపరంగా, వృత్తి, వ్యాపారాల పరంగా అభివృద్ధి చోటు చేసుకుంటుంది. మీ తెలివి తేటలు రాణిస్తాయి. మాట చెల్లుబాటవుతుంది. అయితే, ఇంటి వాతావరణంలో కొంత ప్రశాంతత లోపిస్తుంది. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పెండింగ్‌ పనులను పూర్తి చేస్తారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. స్నేహితురాలు అపార్ధం చేసుకునే అవకాశం ఉంది. ఇరుగు పారుగుతో సమస్యలు తలెత్తవచ్చు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): మూడు ప్రధాన గ్రహాల సంచారంలో వచ్చిన మార్పులు ఈ రాశివారి జీవితంలో ఊహించని మార్పులు తెచ్చి పెడుతుంది. లాభ, భాగ్య స్థానాలు బాగా బలపడినందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. కొద్దిపాటి ప్రయత్నంతో అనూహ్య విజయాలు సాధిస్తారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్ధులు ప్రశంసలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. స్నేహితురాలితో షికారు చేస్తారు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ వారం మూడు ప్రధాన గ్రహాల సంచారంలో వస్తున్న మార్పులు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలిగిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. రియల్‌ ఎస్టేట్‌ వారికి లాభాల పంట పండిస్తుంది. భార్యాపిల్లలు సహాయసహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన కబురు అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) :కుజ స్థంభన, గురు, శని గ్రహాల వక్రగతి కారణంగా ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూల౦గా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో ఉన్న సంతాన౦ నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఎవరికీ డబ్బులివ్వవద్దు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆదాయానికి కొరత లేదు. విద్యార్థులు పురోగతి చెందుతారు. స్నేహితురాలితో సరదాగా గడుపుతారు. ఆహార, ఆతిథ్య రంగంలోనివారికి, చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని తవిధాలా అనుకూల సమయం. కోర్టు వ్యవహారాలలో గెలవచ్చు. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్రీలతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కామర్స్‌ విద్యార్ధులకు సమయం బాగుంది. స్నేహితురాలు తన ఉద్యోగంలో బిజీ అయిపోతుంది. శుభవార్తలు వింటారు. అర్థిక లావాదేవీలకు, సెక్యులేషన్‌కు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : గురు, శని గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. రాశినాథుడైన కుజుడు సప్తమ రాశిలో సంచరించడం వలన. కొద్దిగా ఆరోగ్యం చూసుకుంటే, అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఇది. ఆదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరతాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. పాజిటివ్‌ దృక్పృథం అలవరచుకోండి. పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో విహారానికి వెడతారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు సత్ఫలితాలు సాధిస్తారు. ఐ.టి నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : అదృష్టం కలిసి వస్తుంది. అర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. ఈ వారమంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. విందుల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి అభినందనలు లభిస్తాయి. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొంటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. స్నేహితురాలితో పెళ్లి ప్రస్తావన తీసుకువస్తారు. ఐ.టి నిపుణులకు, టీచర్లకు అన్ని విధాలా బాగుంటుంది. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : కుజ, శని, గురు గ్రహాల సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ, వైద్య సహాయంతో కోలుకుంటారు. నంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన యోగానికి సంబంధి౦చి తీపి కబురు వింటారు. సైన్స్‌, ఐ.టి విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాలలోని వారు విశేషంగా అభివృద్ది సాధిస్తారు. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : గృహ వాతావరణం బాగా ఉంటుంది కానీ, ఉద్యోగంలో అనుకోని చిక్కులు ఎదురై కొద్దిగా ఇబ్బంది పడతారు. చట్ట సంబంధమైన చిక్కుల్లో ఇరుక్కునే అవకాశం కూడా ఉంది. ఇక ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నా లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమీప బంధువుల్లో ఒకరికి సంబంధించి దుర్వార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది. తల్లితండ్రుల్లో ఒకరి అరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : కుజ గ్రహ స్తంభన, శని, గురు గ్రహాల వక్రగతి ఈ రాశి వారికి పూర్తి స్థాయిలో మంచి చేస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలనిస్తాయి. ఈ వారం చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగ,వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. విద్యార్దులు తేలికగా పురోగతి సాధిస్తారు. డబ్బు నష్టపోతారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు అన్ని విధాలా బాగుంది. స్నేహితురాలితో సరదాగా గడుపుతారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్