ఆ ఒక్క వీడియోనే లీకైందా?: సజ్జల

61చూసినవారు
ఆ ఒక్క వీడియోనే లీకైందా?: సజ్జల
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఒక్కటే లీకైందా అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆ వీడియో సరైనదేనా? కాదా అని కూడా చూడకుండా ఈసీ చర్యలు తీసుకోవడం ఏంటని నిలదీశారు. 'పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతోంది. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే అన్ని వీడియోలు బయటపెట్టాలి. అప్పుడే అసలేం జరగిందన్నది బయటకు వస్తుంది' అని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్