చంద్రబాబు వద్ద కొత్త ప్యాకేజీ స్టార్ ప్రశాంత్ కిషోర్: వైసీపీ

57చూసినవారు
చంద్రబాబు వద్ద కొత్త ప్యాకేజీ స్టార్ ప్రశాంత్ కిషోర్: వైసీపీ
ఏపీలో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి ఘోర ఓటమి తప్పదంటూ పలు సందర్భాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అయితే ఆయన అంచనాలు తప్పు అని నిరూపితమయ్యాయని వైసీపీ విమర్శలు గుప్పించింది. చంద్రబాబు వద్ద కొత్త ప్యాకేజీ స్టార్ గా ప్రశాంత్ మారారు అని వైసీపీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించింది. 2022లో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ కు ఓటమి ఖాయమని ఆయన వేసిన అంచనా తప్పిందంటూ ఓ ఇంటర్య్యూలో ప్రశాంత్ కిషోర్ ను ఆధారాలతో ప్రశ్నించిన వీడియోను పోస్టు చేసింది.

సంబంధిత పోస్ట్