పగో: అందరూ అప్రమత్తంగా ఉండాలి
అక్టోబర్ 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో జిల్లాలోని అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14 నుంచి 15 వరకు తేలిక పాటు వర్షాలు కురుస్తాయని, 16 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.