డిసెంబర్ 26న భీమవరంలో సీపీఐ బహిరంగ సభ
భీమవరం పట్టణంలోని స్థానిక 1వ డివిజన్ లో మున్సిపల్ కార్మికుల సీపీఐ శాఖా సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ పశ్చిమగోదావరి జిల్లా సమితి కార్యదర్శి కోణాల భీమారావు పాల్గొని మాట్లాడారు. సీపీఐ శత వార్షికోత్సవాలలో భాగంగా డిసెంబరు 26న భీమవరంలో జరగనున్న ర్యాలీని, బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.