మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మొగల్తూరులోని అంగన్వాడీ సిబ్బంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొగల్తూరులోని గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం అంగన్వాడి సిబ్బంది మానవహారం ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కలకత్తాలో వైద్యురాలిపై ఆగాయిత్యానికి పాల్పడి హత్య చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది జి పెద్దింట్లు, ఎస్ సారమ్మ, ఏ సీతారత్నం గ్రామస్తులు, సిబ్బంది ఉన్నారు.