నరసాపురం మండలంలోని 28 గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు ఇన్ ఛార్జ్ ఎంపీడీవో వీరభద్రరావు శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కూలీలకు నిధులు విడుదల కాలేదని, మండలంలో సుమారు 7000 మంది కూలీలకు రూ. 2 కోట్ల బకాయిలు విడుదల కానున్నాయని చెప్పారు. నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో సొమ్ములు జమ అవుతున్నట్లు ఎంపీడీవో తెలిపారు.