ముసునూరు గురుకుల పాఠశాల తనిఖీ
ఏపీ రేషన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి మస్తానయ్య శనివారం ముసునూరు బాలికల గురుకుల పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సొసైటీ కార్యదర్శి మస్తానయ్య స్థానిక విద్యార్థులతో మీకేమైనా సమస్యలు ఉన్నాయని సంభాషించారు. విద్యార్థులను ఆశయాలను అలవర్చుకోవాలని ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. పాఠశాలలో విద్యార్థులు అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.