నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన పాత ముద్దాయిలు ఎనిమిది మందిపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు నూజివీడు ఎక్సైజ్ సీఐ మస్తానయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, అక్రమ మద్యం తయారుచేసిన అమ్మకాలు చేపట్టిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఆయన హెచ్చరించారు. అంతేకాక ప్రభుత్వ పథకాలు కూడా నిలుపుదల చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.