ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి కొట్టు విమర్శలు

63చూసినవారు
తాడేపల్లిగూడెంలోని కార్యాలయంలో శనివారం మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం చేసిన వ్యాఖ్యలపై కొట్టు ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డులో నాణ్యతా లోపం ఉంటే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి కానీ గత ప్రభుత్వంపై నిందమోపడం సరికాదన్నారు. వందరోజుల చేతకాని పాలనపై ప్రజలు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకొని దానిని దారి మళ్లించడానికి తప్పుడు రాజకీయం చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్