తాడేపల్లిగూడెం లోని ప్రధాన కాలువలో దూకిన మహిళను మారంపల్లికి చెందిన జనసైనికులు కాపాడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తన భర్తతో మనస్పర్ధలతో కాలువలకు దూకిన ఆ మహిళను అటుగా వెళుతున్న మారంపల్లి కి చెందిన జనసైనికులు మిరియాల విజయ్ కుమార్, రామిశెట్టి అప్పారావు, తోట నాగరాజు లు కాలువలోకి దూకి బయటకు తీసి నిండు ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా జనసైనికులను స్థానికులు అభినందించారు.