స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తణుకు పట్టణంలో మంగళవారం 500 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం చేపట్టిన ఈ ర్యాలీలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం ఎంతో మంది సమరయోధులు తమ జీవితాలను స్వాతంత్రం కోసం అంకితం చేశారని అన్నారు.