తణుకునకు చెందిన పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణరావు చౌదరి 104వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం తణుకులో నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణరావు విగ్రహానికి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తణుకు కన్జ్యూమర్స్ సొసైటీ అధ్యక్షులుగా 38 సంవత్సరాలు సేవలందించిన ఆయన రాజకీయవేత్తగా, వాణిజ్యవేత్తగా, సినిమా ఎగ్జిక్యూటివ్ గా తనదైన ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు.