తాడేపల్లిగూడెం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు
బాదంపూడి జాతీయ రహదారి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. తాడేపల్లిగూడెంలో దీపావళి సరుకులు కొనుగోలు చేస్తూ తిరిగి ఇంటికి వస్తుండగా బాదంపూడి వద్ద డివైడ్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని హైవే అంబులెన్స్ లో తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిది ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరానికి చెందిన వారు.