నారాయణపురం: కాలువలో చనిపోయి ఉన్నా పశు కళేబరం నుంచి దుర్వాసన

60చూసినవారు
ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద ఏలూరు ప్రధాన కాలువలో తూడు, గుర్రపు డెక్కలు పేరుకుపోయాయి. దాని మధ్యలో చనిపోయిన పశు కళేబరం ఉండడంతో దుర్వాసనతో భక్తులు, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఆదివారం మండల ఎంపీటీసీ చాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు దృష్టికి భక్తులు, ప్రజలు తీసుకువెళ్లారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్