ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామానికి చెందిన బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు షేక్ రజియా (33) మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ఏరియా ఆసుపత్రికి తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.