రైతాంగానికి సహకార సంఘాలు విస్తృత సేవలు అందించాలని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆచంటలో ది మృత్యుంజయ విశాల సహకార పరపతి సంఘంలో నాబార్డ్ నిధులు రూ. 40 లక్షలతో నిర్మించిన ఎంపిఎఫ్సి గోడౌన్ ను ప్రారంభించటం జరిగింది. గత ఐదేళ్ల పాలనలో సహకార వ్యవస్థను జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం సహకార వ్యవస్థలో జీవం పోసినందుకు కృషి చేస్తుందన్నారు.