సాధారణంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లపై పవన్ కళ్యాణ్ అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాయించడం చూసే వుంటాము. కానీ ఆచంట మండలం పెదమల్లంకు చెందిన గంధం మణికంఠ అనే బాలుడు తన సైకిల్ వెనుక భాగంలో ఈ విధంగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని డిజైన్ చేశాడు. తనకు పవన్ కళ్యాణ్ అంటే అమితమైన ఇష్టమని, అందుకే ఇలా చేశానని తెలియజేయడం గమనార్హం.