ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా వైస్సార్సీపీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమంకి అత్తిలి మండలం నుంచి పెద్ద ఎత్తున యువత తరలివెళ్లారు. మండల కేంద్రం అత్తిలి, మంచిలి తదితర గ్రామల నుంచి వెళ్లిన యువకులను కారమూరి అభినందించారు. సమస్యల పట్ల యువత చైతన్యంగా ఉండాలని సూచించారు.