పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గుణ్ణం చెర్వు ప్రాంతంలో కొబ్బరి చెట్టు అగ్నికి ఆహుతయ్యింది. సోమవారం కొబ్బరి చెట్టు నుంచి ఒక్కసారిగా భారీగా మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే చెట్టు ఉన్న ప్రాంతంలో ఎటువంటి విద్యుత్తు తీగలు లేక పోవడంతో ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఎవరికీ అర్ధం కావడం లేదన్నారు.