పోడూరు మండలం పండితవిల్లూరు గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు పితాని వెంకట్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు. అలాగే 8వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.