రాయితీ విత్తనాలను వినియోగించుకోవాలి: ఎంపీపీ

56చూసినవారు
రాయితీ విత్తనాలను వినియోగించుకోవాలి: ఎంపీపీ
ప్రభుత్వం 80% రాయితీపై అందిస్తున్న వరి విత్తనాలను రైతులు వినియోగించుకోవాలని ఆచంట ఎంపీపీ సూర్యకుమారి అన్నారు. మంగళవారం ఆచంట మండలం ఆచంట వేమవరం, వల్లూరు గ్రామాల్లో నారుమడి దెబ్బతిన్న రైతులకు 80 శాతం సబ్సిడీపై ఎంటీయూ 1153 వరి విత్తనాలను అందజేశారు. వైస్ ఎంపీపీ నాగరాజు, సర్పంచ్ జక్కం శెట్టి చంటి, వల్లూరు ఉప సర్పంచ్ శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి బి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్