ఆచంట మండలం వేమవరం గ్రామంలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమములో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొని ఇది మంచి ప్రభుత్వం అనే లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని వర్గాల ప్రజాలకు మేలు చేకూర్చిన ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం అని అన్నారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతం చేసి వారినీ ఆశీర్వదించి పండంటి బిడ్డలను కనాలని దీవించారు.