అత్తిలి మండలం మంచిలి గ్రామంలో యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా, బుధవారం ఏఎన్ఎం అనంతలక్ష్మి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పిహెచ్సి సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. 6 నెలల వయసు పిల్లల నుంచి 16 ఏళ్ల పిల్లలకు వయసుని బట్టి వివిధ రకాల వ్యాక్సిన్లు అందించామని సిబ్బంది తెలియజేశారు.