అత్తిలి మండలం మంచిలి గ్రామ సచివాలయం వద్ద యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా శనివారం చంటి బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు అందించారు. ఏఎన్ఎం అనంతలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆశా సిబ్బంది పాల్గొన్నారు. రోజుల పిల్లల నుంచి వయస్సును బట్టి వ్యాధి నిరోధక టీకాలు వేశారు.