పిల్లల్లో లోపాలు గుర్తించడంతో సత్వర చికిత్స

71చూసినవారు
పిల్లల్లో లోపాలు గుర్తించడంతో సత్వర చికిత్స
చిన్నపిల్లల్లో వచ్చే లోపాలను గుర్తించడం ద్వారా సత్వర చికిత్స అందించవచ్చని రాష్ట్రీయ బాల స్వాస్థ్య ప్రోగ్రాం రాష్ట్ర అధికారి డాక్టర్ ప్రశాంత్ అన్నారు. గురువారం చాగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి అంగన్వాడి, పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. చిల్డ్రన్ హెల్త్ స్క్రీనింగ్ పనితీరు వివరాలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ హరిచంద్ర, వైద్యులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్