అక్రమ మద్యం అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ బలరామరాజు సోమవారం తెలిపారు. వీరవాసరం మండలం బలుసు గొయ్యలపాలెం గ్రామానికి చెందిన ఇళ్ల నాగ సత్యనారాయణ అక్రమ మద్యం అమ్ముతుండగా దాడి చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడి నుంచి ఏడు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.