బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు జంగారెడ్డిగూడెం హెచ్‌సీ ఉమామహేశ్వరరావు తెలిపారు. పట్టణానికి చెందిన 6వ తరగతి చదువుతున్న బాలిక యొక్క తల్లిదండ్రులు విడిగా ఉంటున్నారు. బాలిక ఏలూరులోని తండ్రి వద్దకు అప్పుడప్పుడు వెళ్తుంది. గత నెల 30 తెల్లవారుజామున బాలిక ఇంటినుంచి వెళ్లిపోయిందన్నారు. బాలిక తల్లి చుట్టుపక్కల, తండ్రి వద్ద వెతికిన బాలిక ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.