లింగపాలెం మండలం సుందరరావుపేట గ్రామంలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్రామానికి చెందిన పొదిల కుమారి ఇంట్లో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపకు సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఇంట్లోని వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ నేపథ్యంలో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.