విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా లింగపాలెం మండలం నరసన్నపాలెంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుధీర్ బాబు (24) ఇంట్లో విద్యుత్తు సరఫరా ఆగిపోవడంతో డాబా పైకి ఎక్కి విద్యుత్ తీగలు సరిచేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో గమనించిన స్థానికులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.