ఆర్ అండ్ బి రోడ్డు మీద ప్రవహిస్తున్న డ్రైనేజీ నీరు

56చూసినవారు
చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వెళ్లే రోడ్డు ఎదురుగా ఒక అపార్ట్మెంట్ పక్కన డ్రైనేజీ మురికి నీరు ఆర్ అండ్ బి రోడ్డు మీదగా ప్రవహిస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మురికి నీరు నిలువ ఉండి విపరీతమైన దోమలతో చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. జ్వరాల బారిన పడతామని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి అక్కడ మురుగు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్