కామవరపుకోట మండలం గుంటుపల్లి బౌద్ధాలయాల సందర్శనకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో ఇన్చార్జ్ మేనేజర్ చందర్రావుకు సహాయ పౌండేషన్ ట్రస్ట్, కామవరపుకోట తరఫున వినతి పత్రం అందజేయటం జరిగింది. ప్రముఖ పుణ్య క్షేత్రాలైన ద్వారకా తిరుమల, మద్ది ఆంజనేయ, తూర్పు ఎడవల్లి ప్రాంతాలను కలుపుతూ జంగారెడ్డిగూడెం కామవరపుకోట చింతలపూడిల నుండి సర్వీస్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.