ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన మలకపల్లి సూర్యనారాయణకు కిడ్ని ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 12 లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు ఎల్‌ఓసీని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శనివారం బాధిత కుటుంబీకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీకి సూర్యనారాయణ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన తెలిపారు.