దొండపాడులోని పరివర్తన్ బధిరుల పాఠశాలలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ సంజ్ఞ భాష దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. వినలేని వారికి సమాచారం అందించేందుకు పుట్టినదే ఈ సంజ్ఞ భాష అని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా సంకేత భాషలున్నాయని గుర్తు చేశారు.