ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఆదివాసీల పిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారాయని సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ. కృష్ణ చైతన్య చెప్పారు. రెడ్డిగూడెం తోగు గుంపులో శనివారం సమావేశం నిర్వహించారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ, ఈ గుంపులో 20 మంది పిల్లలు ఉన్నారని, చదువుకోడానికి కనీసం అంగన్ వాడి కేంద్రం లేకపోవడం బాధాకరమన్నారు. పిల్లలకు 5 సంవత్సరాలు వచ్చినా, బడికి సంబంధించిన వివరాలు తెలియక, అవేదన వ్యక్తం చేశారు.