ఏలూరు పవరుపేటలోని ఓ ఇంటి ముందు మెట్లపై కూర్చున్న వృద్ధుడు అక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అతనికి సుమారు 60 సంవత్సరాల వయసు ఉంటుందని, అనారోగ్య కారణాలతో మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. అతని వివరాలు తెలియరాలేదు.