ఏలూరు: ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి

59చూసినవారు
ఏలూరు: ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ను బుధవారం ఏపీ ఎన్జీవోస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఎస్ ఉద్యమంలో పాల్గొన్న జేఏసీ నాయకులపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ కు ఫైల్ పెట్టి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్