వయో వృద్ధుల సమాజానికి అమూల్యమైన సంపదని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్ లో వయోవృద్ధుల సంక్షేమ చట్టం -2007, నిబంధనలు 2011 ప్రకారం జిల్లా కమిటీపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. 2007లో ప్రభుత్వం వయో వృద్ధుల సంరక్షణకు చట్టం అమల్లోకి తీసుకువచ్చిందన్నారు. అలాగే జిల్లాలో వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు.