సాంప్రదాయేతర ఇంధన వనరులైన సౌరశక్తి వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం ఏలూరు అమీనాపేటలోని సాంఘీక సంక్షేమ బాలికల వసతిగృహంలో ఏర్పాటుచేసిన సోలార్ పవర్ ప్లాంట్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. రూఫ్ టాప్ సోలార్ సిస్టం మంచి ప్రాజెక్ట్ అని, ఇక్కడ ఏర్పాటుచేసిన ప్లాంట్ బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు.