ఏలూరు రూరల్ మండలం పోణంగి మెయిన్ అర్బన్ హౌసింగ్ లే అవుట్ కాలనీని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న గృహ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. అనంతరం గృహ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, గృహనిర్మాణ పనుల్లో నాణ్యత కనబరచాలని సంబంధిత అధికారులకు సూచించారు.