ఏలూరు సిపిఎం నగర కార్యదర్శి పి. కిషోర్ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు.ప్రజా పోరు యాత్రలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక సమస్య, నిర్మాణ రంగం కార్మికుల ఇబ్బందులు, మద్యం, ధరలు పెరుగుదలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. డైవర్షన్పాలిటిక్స్ ఆపి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు.