కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామంలో రజక సంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి ప. గో. జిల్లా రజక సంఘం అధ్యక్షులు చాటపర్తి పోసి బాబు మాట్లాడుతూ. 343 జీవో ప్రకారం కనకరాజు చెరువు 3ఎకరములు రజకుల వృత్తి చేసుకునేందుకు కేటాయించినందుకు గ్రామ పంచాయతీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే గ్రామాలలో ఉన్న రజకులందరు ఐక్యమత్యంతో ఉండి మన హక్కులను సాధించుకోవాలన్నారు.